– బాలల దినోత్సవం నాడు దవఖాన పాలైన బాలలు..
అక్షర కలం : నాగార్జునసాగర్
స్థానిక కమల నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న పిల్లలు సాయంకాలం గ్లూకోస్ , ఇంజక్షన్ తీసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత వైద్యం వికటించి వాంతులు విరోచనాలతో పరుగులు పెడుతూ ఆసుపత్రికి వచ్చిన తల్లిదండ్రులు, బాలల దినోత్సవం నాడు పిల్లలకు వైద్యం వికటించి వాంతులు విరోచనాలు కావడంతో ఆందోళనలో తల్లిదండ్రులు…ప్రైవేట్ దవఖానలో చూపించాలంటే డబ్బులు ఎక్కువైతే అని ,ఆర్థిక స్తోమత లేని మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వాసుపత్రిని నమ్ముకుని వెళ్తే పిల్లలకు వైద్యం వికటించిందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంచార్జ్ సీ.ఎం.ఓ భానుప్రసాద్ వివరణ :–
పిల్లలు గత నాలుగు రోజుల నుండి జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ ,14 తారీకు రాత్రి కొంతమంది పిల్లలు డిస్చార్జ్ అవడంతో గుల్కోజ్ , ఇంజక్షన్ ఇచ్చి పంపించడం జరిగిందని ,ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలకు వాంతులు విరేచనాలు అవడంతో తిరిగి ఆసుపత్రి రావడం జరిగింది. మా డాక్టర్లు అందుబాటులో ఉన్నారని , డాక్టర్ల పర్యవేక్షణలో తగిన చికిత్స ఇస్తున్నామనీ,గత నాలుగు రోజుల నుండి పిల్లలకు అదే ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామని తెలిపారు. చికిత్స పొందిన తర్వాత పిల్లలందరూ నార్మల్ గా ఉన్నారని డాక్టర్ భాను ప్రసాద్ తెలిపారు.