నందికొండలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని మరచిన అధికార యంత్రాంగం …

అక్షర కలం నాగార్జునసాగర్ / నందికొండ

నందికొండ మున్సిపాలిటీ పరిధిలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను మరచిన అధికార యంత్రాంగం. మహనీయుల జయంతి వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్న క్షేత్రస్థాయిలో నిర్వహించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు మరియు నాయకుల మధ్య ఉన్న సమన్వయ లోపం ఆధిపత్య ధోరణితో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించక పోవడం అధికారుల బాధ్యత రాహిత్యాన్ని సూచిస్తుంది.భారతీయ సంఘసంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి, ఆమె అన్ని వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన జ్యోతిరావు పూలే కులమత బేధాలు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి గొప్ప వ్యక్తి వర్ధంతిని నిర్వహించకపోవడం ముమ్మాటికీ రాజకీయ నాయకులు,అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణలో మొత్తం పలు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సావిత్రిబాయి పూలే వర్ధంతి నిర్వహిస్తుండగా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో మాత్రం ఆ ఊసే లేదు…

The administration forgot Savitribai Phule's death anniversary in Nandikonda...
Comments (0)
Add Comment