ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా… – 17 నుండి అక్టోబర్ రెండు వరకు సేవా కార్యక్రమాలు..

కొల్చారం, సెప్టెంబర్ 14( అక్షర కలం):-మెదక్ జిల్లా, నర్సాపూర్ నియోజకవర్గం, కొల్చారం మండలంలో సేవా పక్షం మండల స్థాయి కార్యాశాల మండల అధ్యక్షుడు హరీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షుడు వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షుడు వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తేదీన దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 17 తేదీ నుండి అక్టోబర్ 2 తేదీ వరకు 15 రోజులు సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు, అమ్మ పేరుతో మొక్కలు నాటడం, కుల వృత్తుల వారిని మరియు రిటైడర్ అధికారులను సన్మానించడం ప్రభుత్వ ఆసుపత్రిలో పాఠశాలల్లో పనుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు నిర్దేశించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, మండల అధ్యక్షుడు ఘనపూర్ హరీష్, మండల ప్రధాన కార్యదర్శులు చిట్కుల గిరి, పల్లె రవికాంత్, మండల ఉపాధ్యక్షుడు రవి గౌడ్, మండల కార్యదర్శి బాబా గౌడ్, బిజెపి మండల కోశాధికారి శివలాల, గిరిజన మోర్చ మండల అధ్యక్షుడు పూల్ సింగ్, మెదక్ జిల్లా కౌన్సిల్ మెంబర్ శేఖర్ యాదవ్, సేవా పక్షం మండల కన్వీనర్ హర్షవర్ధన్ రెడ్డి, కోకన్వీనర్ సంగమేష్, మాలవత్ అంజా, బిజెపి జిల్లా నాయకులు అంజా గౌడ్, ఘనపూర్ పూర్ బూత్ అధ్యక్షులు మహేష్, అంసన్పల్లి బూత్ అధ్యక్షులు శివ, రంగంపేట భూత అధ్యక్షులు పోచందర్, మండల సీనియర్ నాయకులు రంగాగౌడ్ బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Prime Minister Narendra Modi's birthday ...
Comments (0)
Add Comment