మహిళా శక్తిగా అంక్షా రెడ్డి మరింత ఎదగాలని ఆకాంక్ష…

– సీనియర్ నాయకుడు బుడ్డ భాగ్యరాజ్…

– వెల్లివిరిసిన అభినందనలు….

 మెదక్, నవంబర్ 26( అక్షర కలం వెబ్ ):-

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన ఆంక్షా రెడ్డి గారిని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బుడ్డ భాగ్యరాజ్ బుధవారం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా భాగ్యరాజ్ మాట్లాడుతూ మహిళల నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తుందని,ఆ దిశగా అంక్షారెడ్డి వంటి ధైర్యవంతమైన నాయకులు పార్టీకి బలం చేకూరుస్తారని పేర్కొన్నారు.

మహిళా సాధికారతకు అంక్షా రెడ్డి పోషిస్తున్న పాత్ర ఆదర్శప్రాయమని, ఆమె కొత్త పదవిలో ప్రజలకు మరింత చేరువవుతూ సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నాచారం గుట్ట చైర్మన్ రవీందర్ గుప్తా , బాలేష్ గుప్తా సి ఆర్ జానకిరాములు , ఆశాజ్యోతి మల్లేశం, సిద్ధి రాములు , లంబు వెంకటేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Hope that Anksha Reddy will grow more as a female power...
Comments (0)
Add Comment