హోరాహోరీగా సాగిన ఎన్నికలు 

–పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుగా సట్టు సైదులు

–9 ఓట్లతో రాంబాబుపై సైదులు గెలుపు

అక్షరకలం నల్గొండ

నల్లగొండ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడి సట్టు సైదులు ఎన్నికయ్యారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రతినిధుల ఎన్నికలు నిర్వహించగా 13 మంది ఏఆర్ విభాగం నుండి 30 మంది సివిల్ విభాగం నుండి మొత్తం 49 మంది ప్రతినిధులు వివిధ సర్కిల్ నుండి ఎన్నికయ్యారు. స్టేషన్ల వారిగా ఎన్నికైన ప్రతినిధులను ఓటర్లుగా మార్చి 13 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎఎస్పీ రమేష్ అధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. కాగా అధ్యక్షులుగా సట్టు సైదులు, రాంబాబులు ఇద్దరు రెండు ప్యానల్గా విడిపోయి పోటీ చేశారు. దీంతో పట్టు సైదులు అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్యానల్ తొమ్మిది ఓట్ల మెజర్టీతో గెలుపోందారు. సట్టు సైదులు ప్యానల్కు 29 ఓట్లు రాంబాబుకు 20 ఓట్లు వచ్చాయి. దీంతో సట్టు సైదులు ప్యానల్ విజయం సాధించిన అధికారులు వెల్లడించారు. ప్రదాన కార్యదర్శిగా పసుపులేటి బాలకృష్ణ, కోశాధికారిగా కాశిరెడ్డి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఇరిగి రవి, కరుణాకర్, సంయుక్త కార్యదర్శి కోటా సాయిరాం, కార్యనిర్వహాక కార్యదర్శి చిన్నపంగు వినోద్ సభ్యులుగా అజ్మీర్ రమేష్, నాగజ్యోతి, బాస్కర్, అలకుంట్ల సుదాకర్, దాచు శ్రీహరి వెంకన్నలు ఎన్నికయ్యారు. కాగా మరో రెండు కోఅప్షన్ సభ్యులను తొలి సమావేశంలో ఎన్నుకోనున్నారు. ఎన్నికైన సభ్యులు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ను మార్యాదపూర్వకంగా కలువగా వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

హోరాహోరీగా సాగిన ఎన్నికలు
Comments (0)
Add Comment