*కాంగ్రెస్ అభ్యర్ధి వినూత్న ప్రచారం*

వలిగొండ  డిసెంబర్ 08 అక్షరకలం

వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బద్దం కరుణ శ్రీ పవన్ కుమార్ రెడ్డిలు వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పహిల్వాన్ పురం గ్రామ సెంటర్ లో ఉన్న చికెన్ షాప్ సెంటర్ కు వెళ్లిన ఆమె అక్కడ చికెన్ కొడుతూ ఓటర్లను ఓటు అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో,గ్రామఅభివృద్ధికి కృషి చేస్తానన్నారు.గ్రామ ఓటర్లు కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

*Congress Candidate's Innovative Campaign*
Comments (0)
Add Comment