జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన * పాఠశాల, ఆసుపత్రి తనిఖీ

 

 

మగపేట, ఆగస్టు 22 ( అక్షర కలం ) :

మండల కేంద్రమైన మంగపేటలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. మంగపేట జడ్పీ స్కూల్ కాంప్లెక్స్ లోని ఎంపీపీఎస్ పాఠశాల, జడ్పీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆయా పాఠశాలలోని విద్యార్ధులను కొన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. విద్యార్దులు సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో తాను మరల త్వరలో వస్తానని అప్పటికి మంచిగా చదువుకోవాలని విద్యార్ధులకు సూచించారు. విద్యార్ధులు చక్కగా చదువుకుని బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలన్నారు. విద్యార్ధులకు విద్య భోధన సరిగా చేయాలని, నాణ్యమైన ఆహారం అందించాలని జడ్పీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ( ఇంచార్జి మండల విద్యాశాఖ అధికారిణి ) పొదెం మేనకతో పాటు ఇతర ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ దివాకర టి.ఎస్ తనిఖీ చేశారు. హాస్పిటల్ కు సంబందించిన రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిలో పేషెంట్ రూమ్ ను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులను వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సరిపోనూ , అవసరమైన మందులు ఉన్నాయా అని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తుమ్మ స్వప్నను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులు ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట మంగపేట తహశీల్దార్ తోట రవీందర్, ఎంపీఓ పొదిల్ల శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

 

hospital inspectionఆసుపత్రి తనిఖీDistrict Collector's sudden visit * school
Comments (0)
Add Comment