పోలీస్ సిబ్బంది సంక్షేమమే మా లక్ష్యం

— జిల్లా అధ్యక్షులు సట్టు సైదులు

అక్షరకలం నల్లగొండ : పోలీస్ సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని పోలీస్ సంక్షేమ సంఘం నూతన జిల్లా అధ్యక్షుడు సట్టు సైదులు, ప్రధాన కార్యదర్శి కె. సాయిరాం తెలిపారు. నల్లగొండ ఎస్పీ కార్యాలయంలోని సంఘం ఆఫీస్‌లో సోమవారం వీరు బాధ్యతలు స్వీకరించారు.

​ పోలీసులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడి, కుటుంబ, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని వెల్లడించారు. వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు.

​ ఎన్నికల్లో తమకు భారీ మెజార్టీ అందించి గెలిపించిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కె. కరుణాకర్, ఈ. రవి, జాయింట్ సెక్రెటరీ బాలకృష్ణ, కోశాధికారి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వినోద్ బాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.