—–జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి:
—-టి యు డబ్ల్యూ జే (ఐ జే యు )జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి
నల్లగొండ,ఆగస్టు 30,(అక్షర కలం ):
వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి టి యు డబ్ల్యూ జే(ఐజేయు) నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి అన్నారు.కనగల్ లో ఆదివారం టీయూడబ్ల్యూజే మండల సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు.అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలను మంజూరు చేయించేందుకు టి యు డబ్ల్యూ జే పోరాడుతుందన్నారు.
అనంతరం కనగల్ మండల ప్రెస్ క్లబ్ (టీయూడబ్ల్యూజే) కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులు: సుంకిరెడ్డి జాగాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి:మల్లెపల్లి నరసింహ,
ఉపాధ్యక్షులు:దాసిరెడ్డి నవీన్ రెడ్డి,మహేశ్వరం రమేష్ కుమార్,కోశాధికారి: రాయల సునీల్ కుమార్,కార్యదర్శి: పాలకూరి లింగస్వామి,
సహాయ కార్యదర్శి: తొరకొప్పుల నాగయ్య,కమిటీ సభ్యులు: చీదేటి వంశీధర్ రెడ్డి,మాచర్ల లక్ష్మీనారాయణ తదితరులను ఎన్నుకున్నారు.
అనంతరం నూతన కమిటీ సభ్యులను జిల్లా అధ్యక్షుడు శాలువాలు కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి దోటి శ్రీనివాస్,అక్షర కలం ఎడిటర్ పిట్టల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.