*సమాజం తలదించుకునేలా పోలీసుల అత్యుత్సాహం
*బీఆర్ఎస్ నాయకుల ధర్నాలు, నిరసనలు
*అక్షర కలం, అందోలు ప్రతినిధి:*
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు.

జిల్లా పరిధిలోని పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాలు ప్రజాసంఘాలతో అట్టుడుకాయి. బీఆర్ఎస్ మాట్లాడుతూ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం నేరమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల హక్కులను అడ్డుకునే విధంగా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన
తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును కాలరాసే ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు.