నల్గొండ ‘హిస్టరీ’కి ప్రచార ‘విక్టరీ’ - Akshara Kalam" /> నల్గొండ ‘హిస్టరీ’కి ప్రచార ‘విక్టరీ’ - Akshara Kalam" />

నల్గొండ ‘హిస్టరీ’కి ప్రచార ‘విక్టరీ’

— 150 అడుగుల జెండాతో ‘హెరిటేజ్ వాక్’

–దేవరకొండ కోటను మినీ గోల్కొండగా తీర్చిదిద్దుతాం

— కలెక్టర్ చంద్రశేఖర్

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం

నల్గొండ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

ఈ నెల 27న నిర్వహించనున్న “ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని” పురస్కరించుకొని జిల్లా పర్యటకశాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన “హెరిటేజ్ వాక్” ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాగార్జునసాగర్, బుద్ధవనం, పానగల్ ,చెరువు గట్టు, దేవరకొండ కోట వంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వీటన్నిటి గురించి అందరికీ విస్తృతంగా తెలియజేసి వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పానగల్, నాగార్జునసాగర్, బుద్ధవనం, చెరువుగట్టు వంటివి ఎంతో పెరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాయని, అలాగే దేవరకొండ కోట ను మినీ గోల్కొండలా తయారు చేసేందుకు అవకాశం ఉందని, జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై విస్తృత ప్రచారం కల్పించి అభివృద్ధి చెందేలా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమిర్ అలీ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ, రఫిక్, మల్లికార్జున్, పీడీలు, పిఈటి లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా 300 మందికి పైగా క్రీడాకారులు,నర్సింగ్ కళాశాల విద్యార్థులు,పర్యటకాభిమానులు సుమారు 150 అడుగుల జాతీయ జెండాతో “హెరిటేజ్ వాక్ ”లో పాల్గొని అందర్నీ ఆకట్టుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.