చీకటి పడకముందే నిమజ్జనం పూర్తి కావాలి  –జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్

–పెద్ద మునిగాళ్ళలో నిమజ్జన ఘాట్‌ను ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి పరిశీలించిన కలెక్టర్ 

–అధికారులకు కీలక ఆదేశాలు

ఉమ్మడి నల్లగొండ బ్యూరో అక్షరకలం 

గ్రామస్థాయిలో వినాయక విగ్రహాల నిమజ్జనం చేసే చోట చీకటి పడకముందే నిమజ్జనం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ నిర్వాహకులతో కోరారు.

 ఆదివారం అయన దేవరకొండ డివిజన్లోని నెరేడుగొమ్ము మండలం, పెద్ద మునిగాళ్ళలో వినాయక విగ్రహాల నిమజ్జనం చేసే ప్రదేశాన్ని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తో కలిసి సందర్శించి నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. పెద్ద మునిగాళ్లకు మారుమూల ప్రాంతాల నుండి వినాయక నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉన్నందున గ్రామాల నుంచి వచ్చే విగ్రహాలు ఎక్కువసేపు ఊరేగింపులో చీకటి పడే వరకు ఉండకుండా ముందుగానే నిమజ్జనం చేసుకోవాలని,

తద్వారా ప్రమాదాలు సంభవించకుండా ఉంటాయని, ఈ విషయం వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అవగాహన కల్పించాలని రెవెన్యూ ,పోలీస్ అధికారులకు సూచించారు. నిమజ్జనం చేసే చోట లైటింగ్ తో పాటు, బారికేడ్లు, క్రేన్లు, తాగునీరు, గజ ఈతగాళ్ళు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలని, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దేవరకొండ సబ్ కలెక్టర్ 

కరోలిన్ చింగ్ థియాన్ మావి,

డిఎస్పి, వైద్య ఆరోగ్య, ఆర్ డబ్ల్యు ఎస్, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.