వినాయక నిమజ్జనానికి పక్కా ఏర్పాట్లు చేయాలి

— జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్

–జిల్లా వ్యాప్తంగా 28 నిమజ్జన కేంద్రాలు.. 6 వేల విగ్రహాలు వచ్చే అవకాశం !

​–నిమజ్జన ప్రాంతాల్లో బారికేడింగ్, క్రేన్లు, సీసీ కెమెరాలతో కంట్రోల్ రూమ్‌ల అనుసంధానం

 ఉమ్మడి జిల్లా బ్యూరో అక్షరకలం 

వినాయక ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉందని అందువల్ల నిమజ్జన కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం అయన వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ తో కలిసి రెవెన్యూ, పోలీస్ ,ఆర్డిఓలు మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసిల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వినాయక నిమజ్జనం లో భాగంగా సోమ, మంగళ, బుధవారాలలో ఎక్కువ విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉందని, అందువల్ల అన్ని నిమజ్జన కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం సరైనంత నీటి వసతి లేనందున భక్తులు చెరువులు, కుంటలు, నదుల లోపలికి దిగి నిమజ్జనం చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నిమజ్జన కేంద్రాల వద్ద లైటింగ్ తో పాటు, బారికేడింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టం, క్రేన్లు, మెడికల్ టీంలు, సూపర్వైజర్ల ను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు అవకాశం లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, బేబీ పాండ్స్ ఏర్పాటు చేసి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, నిమజ్జనంలో పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారుల పాత్ర ముఖ్యమని అన్నారు.విగ్రహాలు నిమజ్జనం చేసే నిర్వాహకులు వినాయక విగ్రహాలతో పాటు, చెత్తను నీటిలో వేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలో వేయాలన్నారు. నిమజ్జనం సందర్భంగా స్థానిక పోలీసులతో పాటు, 12వ బెటాలియన్ పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్, ఆపదమిత్ర సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీలులేదని అన్నారు.

—28 నిమజ్జన ప్రదేశాలు…..

 జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 28 నిమజ్జన ప్రదేశాలను గుర్తించడం జరిగిందని, ఈ కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు తో పాటు, అన్ని ఏర్పాట్లను చేయాలని, ముఖ్యంగా తహసిల్దారులు, ఎంపీడీవోలపై ఎక్కువ బాధ్యత ఉందని, శనివారం జిల్లా వ్యాప్తంగా 500 విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో ఎక్కువ మొత్తంలో విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని, గతంలో చేసిన ఏర్పాట్లను మించి ఈసారి చేయాలని, ఈ సంవత్సరం విగ్రహాలు ఎక్కువగా రిజిస్టర్ అయి ఉన్నందున ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేయాలన్నారు. అన్ని చోట్ల బారికేడింగ్ తో పాటు, క్రేన్లు, లైటింగ్ ,పోలీసు బందోబస్తు ఏర్పాటు, అన్ని చూడాలని ,ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవద్దని, విగ్రహాలు నిమజ్జనం చేసే చోట సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలన్నింటిని డివిజన్ తో పాటు, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ కి అనుసంధానించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు నేరుగా నీటి ప్రదేశాలలోకి వెళ్లి వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకుండా చూడాలని, అక్కడ ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్ళ ద్వారా మాత్రమే విగ్రహాలను లోపలికి తీసుకువెళ్లి నిమజ్జనం

Go back

Your message has been sent

Warning
Warning
Warning
Warning

Warning.

చేయాలని, నిమజ్జనం చేసిన విగ్రహాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని రిజిస్టర్లో నమోదు చేయాలని చెప్పారు. ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు మాట్లాడారు.