—ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేయాలి
—సంచలనం కోసం కాకుండా, వాస్తవాలనే ప్రజలకు అందించాలి
—డిజిటల్ యుగంలో జర్నలిస్టులు మరింత బాధ్యతగా ఉండి సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలి
—నల్గొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్
—వార్తల్లో వాస్తవికత అవసరం
—జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్
అక్షరకలం ప్రతినిధి, నల్గొండ
సమాజానికి మీడియా దిక్సూచిలా ఉండాలి నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తో కలిసి తన చాంబర్ లో అక్షరకలం తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమాజానికి దిక్సూచిలా పనిచేయాలని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ కొనియాడారు. వార్తలను ప్రచురించేటప్పుడు కేవలం సంచలనం కోసం కాకుండా, వాస్తవాలను నిర్ధారించుకుని ప్రజలకు అందించాలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పర్యవేక్షిస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకమని కొనియాడారు. నేటి డిజిటల్ యుగంలో ఫేక్ న్యూస్ (అవాస్తవ ప్రచారం) పెరుగుతున్న తరుణంలో, జర్నలిస్టులు మరింత బాధ్యతగా ఉండి సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జర్నలిస్టులు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
–—బాధ్యతయుతంగా పనిచేయాలి…..

సమాజ హితం కోసం మీడియా ప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. అక్షరకలం తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు మీడియా ఎంతో సహకారం అందిస్తుందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. సైబర్ నేరాలు, గంజాయి వినియోగం, రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని, సమాజానికి మేలు చేసే వార్తలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీడియా కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, ప్రజలకు వేగంగా, కచ్చితమైన సమాచారాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అక్షరకలం ఎడిటర్ పిట్టల రామకృష్ణ, ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్యూరో ఎం. రాంప్రసాద్, నల్లగొండ ఆర్సీ ఇన్చార్జి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
—–డిపిఆర్ఓ కార్యాలయంలో…

జిల్లా పౌర సంబంధాల కార్యాలయంలో పౌర సంబంధాల శాఖ ఏడి వెంకటేశ్వర్లు అక్షరకలం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తూ వాస్తవాలను మాత్రమే వార్తలుగా రాయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా పనిచేయాలని అన్నారు.