సోమవారం ఉదయాదిత్య భవన్లో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి 2025- 26 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల పై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
నల్లగొండ, సెప్టెంబర్,29 (అక్షర కలం వెబ్ ):
ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో భాగంగా 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సన్నధాన్యానికి, దొడ్డు ధాన్యానికి వేరువేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తప్పనిసరిగా నాణత్య ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. రైస్ మిల్లర్లు ముందుగానే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందే కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలన్నారు. లారీల సమస్య రాకుండా ముందే చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతుల నుండి ఎక్కడ కమిషన్లు తీసుకోవద్దని, ఒకవేళ అలాంటివి ఏమైనా తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ధాన్యానికి సంబంధించి నాణ్యత పై డివిజన్, మండలాల వారిగా కమిటీలను నియమించనున్నట్లు కాగా ఈ సంవత్సరం జిల్లాలో ఖరీఫ్లో 6,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని అంచనా వేయడం జరిగిందని,ఇందులో 1,65,000 మె. టన్నుల సన్నధాన్యం,తక్కినది దొడ్డు ధాన్యం వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ దాన్యానికి క్వీన్తలుకు 2389 /-రూపాయలు, సాధారణ రకానికి2369/- రూపాయలు మరియు 500 రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు .
జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీష్ ,పౌర సరఫరాల జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, డి సి ఓ పత్యానాయక్,, ఆర్టీవో లావణ్య, ఏఈవోలు, ఐకెపి ఇన్చార్జీలు, పిఎసిఎస్ ఇన్చార్జీలు, ఏపీఎంలు ,ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, , నల్గొండ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నారాయణ, మిర్యాలగూడ అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.