*జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం*

క్షర కలం  వెబ్  సెప్టెంబర్ 17 నల్లగొండ :

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలపన చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ… పోలీసు అధికారులకు, సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ,

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ,హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో ఉండేదనీ,ఆనాటి కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో విజయవంతమై, అప్పటి నిజాంరాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1948 సెప్టెంబర్ హైదరాబాద్ సంస్థానం..! భారత యూనియన్ లో అంతర్భాగం అని ప్రకటించడం జరిగింది. కావున ఈ రోజును మనం “తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం” గా జరుపుకుంటున్నాం అన్నారు



ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్,యస్బి డీఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు,సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ,ఏ.ఓ శ్రీనివాస్ సీఐలు, ఆర్.ఐలు,ఎస్.ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.