ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్

అక్షర కలం వెబ్ సెప్టెంబర్ 18 మంగపేట:

మంగపేట ఇన్చార్జి ఎంపీడీవోగా పొదిళ్ల శ్రీనివాస్ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు మంగపేట ఎంపీడీవోగా ఉన్న బి.బద్రు నాయక్ ను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ( డీఆర్డీఏ ) కు అటాచ్ చేస్తూ అదే విధంగా మంగపేట ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న పొదిళ్ల శ్రీనివాస్ కు మంగపేట ఇన్చార్జి ఎంపీడీవోగా బాధ్యతలు అప్పగిస్తూ ఈ నెల 16న జడ్పీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గురువారం పొదిళ్ల శ్రీనివాస్ మంగపేట ఇన్చార్జి ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన పొదిళ్ల శ్రీనివాస్ కు ఎంపీడీవో ఆఫీస్ ఉద్యోగులు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పొదిళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేక అధికారులు, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు, సిబ్బంది, మండల ప్రజల సహకారంతో తన పరిధిలో ఉన్నంత వరకు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.