త్రాగునీటిలో “మాండూకం”

–ఆందోళన చెందిన విద్యార్థులు 

—ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా

—సమస్యను పరిష్కరించిన రిజిస్టార్

 అక్షరకలం ప్రతినిధి, నల్గొండ

మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో విద్యార్థులు త్రాగే నీటిలో కప్ప (మాండూకం) ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల యూనివర్సిటీలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. రిజిస్టార్ స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీంతో విషయం తెలుసుకున్న రిజిస్టర్ సంబంధిత ప్రిన్సిపాల్ ను వెంటనే పిలిపించి, సీసీటీవీ ని పరిశీలించి అనంతరం సమస్యను పరిష్కరించాలని సూచించారు. రిజిస్టార్ సూచనల మేరకు ప్రిన్సిపల్ చర్యలు తీసుకొని సిబ్బందితో త్రాగునీటిలో ఉన్న కప్పను తొలగించారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షులు హనుమాన్, విద్యార్థి నాయకులు విజయ్, సంపత్, సతీష్, అజయ్, సుధీర్, శంకర్, నందు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.