నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) సంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్.

సంగారెడ్డి ప్రతినిధి, అక్షరకలం..

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్,ప్రవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా DEO గారికి వారి కార్యాలయంలో ఇంచార్జ్ మేడం కి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.

 ఈ సందర్భంగా *PDSU జిల్లా అధ్యక్షులు సందీప్,జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీకాంత్* మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు ఎటువంటి నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయన్నారు. ఇంకా 2025–26 విద్యా సంవత్సరం ముగియకముందే వచ్చే విద్యా సంవత్సరం అనగా 2026–27 సంబంధించిన అడ్మిషన్లను అక్రమంగా చేర్చుకుంటున్నారన్నారు. మాఫియా తరహాలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు లక్షలాది రూపాయల ఫీజులను ముందస్తుగానే వసూలు చేస్తున్నాయన్నారు. బహాటంగానే బోర్డులు పెట్టి మరి అడ్మిషన్లు చేస్తున్న చర్యలు తీసుకోవలసిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. అదేవిధంగా అనేక పాఠశాలలు టెక్నో, ఈటెక్నో, ఒలంపియాడ్, జీనియస్, ఇంటర్నేషనల్ పేరుతో కొనసాగుతున్నాయి. ఇలాంటి తోక పేర్లతో కొనసాగవద్దని ఇదివరకే జీవో నెంబర్ 1, జీవో 100, విద్యా హక్కు చట్టం చెప్తున్నాయన్నారు. ఈ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రణ చట్టం అమలు కావడం లేదు అన్నారు. క్వాలిఫైడ్ టీచర్స్, విద్యార్థుల సంఖ్య కనుగుణంగా మౌలిక వసతులు టీచింగ్,నాన్ టీచింగ్ సిబ్బంది లేరు. లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నా దానికి తగ్గట్టు విద్యార్థులకు వసతులు కల్పించడం లేదు. అదేవిధంగా విద్యాహక్కు చట్ట ప్రకారం 25% అడ్మిషన్లను పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలి. కానీ అమలు చేయడం లేదు. కావున నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా DEO గారికి వారి కార్యాలయంలో ఇంచార్జ్ మేడం కి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో తనిఖీలు నిర్వహించాలని నిబంధనలను పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.