సంగారెడ్డి ప్రతినిధి,అక్షరకలం :.కొండాపూర్ మండలం మునిదేవుని పల్లి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ డప్పు కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం లో జాతీయ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం జరిగి 12 ఏళ్లు పూర్తయినందున అమరవీరుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. తాను సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని గ్రామాభివృద్ధికి తాను ఎల్లవేళలా కష్టపడతానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వరలక్ష్మి గ్రామ కార్యదర్శి దినేష్, వార్డు సభ్యులు గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెంటయ్య, స్వయం సహాయక బృందాల మహిళలు,గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.