జోస్ అలుక్కాస్ జ్యువెలరీ షోరూంలో 60 వ వార్షికోత్సవ సంబరాలు

  •  కేక్ కట్ చేసి ప్రారంభించిన నగర మేయర్ దండు నీతూ  కిరణ్
  • జోస్ అలుక్కాస్ సామాజిక సేవలు అభినందనీయం
  •  బ్రోచర్ ఆవిష్కరించిన నగర మేయర్

బతుకమ్మ, నిజామాబాద్ సిటి

జోస్ అలుక్కాస్ జువెలరీ షోరూం అధునాతన డిజైన్ లో బంగారు, వజ్రాభరణాలను అందుబాటులో ఉంచుతూ వినియోగదారుల అభిమానాన్ని చూరగోనడం అభినందనీయమని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు శనివారం జోస్ అలుక్కాస్ 60 వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమం షోరూం ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ దండు నీతూ కిరణ్ కేక్ కట్ చేసి సంబురాలను ప్రారంభించారు. మేయర్ చేతుల మీద బ్రోచర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోస్ అలుక్కాస్ ఆభరణాల రంగంలో 60 వసంతాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను అందించడంతోనే ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ఆభరణాల వ్యాపారం తో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం హర్షణీమన్నారు. సి ఎస్ ఆర్ పండ్ ద్వారా పాఠశాలకు డిజిటల్ పాఠాలు బోధించడానికి వీలుగా టీవీలు ఫర్నిచర్ అందజేశారని వివరించారు. ఆరు వారాల పాటు వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేయడానికి ఏర్పాట్లు చేశారన్నారు. ఆరు కోట్ల రూపాయల బహుమతులు ఆరు వారాలపాటు అందించనున్నారని తెలిపారు. ప్రతివారం లక్కీ డ్రా ద్వారా విజేతలకు గృహోపకరణాలు బహుమతులుగా అందించడానికి అందుబాటులో ఉంచారన్నారు. ప్రతి కొనుగోలు పై బహుమతులు అందజేస్తున్నారని తెలిపారు. మెగా బంపర్ బహుమతులు గా ఆరు కార్లు అందజేస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ధనీష్, ఫ్లోర్ మేనేజర్ సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.