విద్యార్థి రక్షిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి

  •  పాలిటెక్నిక్ కళాశాలను ముట్టడించిన విద్యార్థి సంఘాల నాయకులు
  •  విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో గల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రక్షిత మృతి పై బి ఐ తో దర్యాప్తు చేయాలని పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, యుఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి డిమాండ్ చేశారు. సోమవారం ఆల్టెక్నిక్ కళాశాలను విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించి ఆందోళన నిర్వహించారు. సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ .. శనివారం రోజున అనుమాదాస్పద స్థితిలో హాస్టల్ బాత్రూంలో చనిపోయిన విద్యార్థి రక్షిత మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. విద్యార్థి రక్షిత చనిపోయే ముందు సీసీ కెమెరాలు అదే సమయంలో పని చేయకపోవడం, కుటుంబ సభ్యులు రాకముందే మృతదేహాన్ని హుటాహుటిన మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించడం చూస్తుంటే పోలీసులు, అధ్యాపకులు కలిసి లోపాయికారి ఒప్పందానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తవుతున్నాయన్నారు. విద్యార్ధి రక్షిత మృతిచెందిన విషయాన్ని కుటుంబానికి తప్ప బయటకు పొక్కకుండా ప్రయత్నాలు చేశారని, నిష్పాక్షపాతంగా విచారణ జరిపించాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనకు నైతిక బాధ్యులైన ప్రిన్సిపల్, వార్డెన్ పై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు నడిపింటి కార్తీక్, నాయకులు దేవిక, సాయినాథ్, ఏఐపిఎస్ యు సాయికుమార్, తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

A thorough inquiry should be conducted into the student's protective death

Leave A Reply

Your email address will not be published.