పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

బతుకమ్మ, మోర్తాడ్:  పిల్లలకు పౌష్టికాహారం అందించడం వలన శారీరక మానసిక ఎదుగుదల ఉంటుందని అలాగే ప్రీస్కూల్ విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి అంగన్వాడీ టీచర్ సుజాత అవగాహన కల్పించారు. మోర్తాడ్ మండలం దొన్ పాల్ గ్రామంలో శనివారం ఈసీసీఈ ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లల తల్లి దండ్రులకు అవగాహన కల్పించారు. కొత్తగా వచ్చిన పోర్ట్ పోలియో బ్యాగ్స్ గురించి వివరించారు. ఈ సందర్భంగా పిల్లల పెరుగుదలను పర్యవేక్షించి చూశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.