కొల్చారం, సెప్టెంబర్ 25 ( అక్షర కలం వెబ్ ):-
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మంజీరా నది తీరాన వెలిసిన ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గభవాని మాత అమ్మవారిని గురువారం మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి దర్శించుకున్నారు. ఆమెకు పండితులు, స్వాగతం పలికారు వనదుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. శ్రీ కూష్మాండ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని దుర్గమ్మను కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో

ప్రముఖ సంఘసేవకులు బండారి గంగాధర్, మాజీ ఎంపీపీ సావిత్రి రెడ్డి, నాయకులు మీరాజ బుచ్చిరెడ్డి, స్రవంతి, చిరంజీవి, సునీల్ యాదవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.