జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఏర్పాట్లు పూర్తి…..

– నేటి నుండి జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం ( ఎన్.డి.డి)…

– జిల్లాలో 1-19 సంవత్సరాల.1,81,425 మంది పిల్లలు గుర్తింపు…..

– 2,36,400 ( రెండు లక్షల ముప్పై ఆరువేల నాలుగు వందల ) అల్బెండజోల్ మాత్రలు సిద్ధం…..

– 1 – 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ అల్బెండజోల్ టాబ్లెట్లు వేయించడం…..

– చేతుల శుభ్రత వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు…..

– మెదక్ జిల్లాలో నిర్వహించబోయే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు…..

– జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్…..

మెదక్ /కొల్చారం జూలై13(అక్షర కలం):- 

నేటి నుండి నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలో ఈ కార్యక్రమా నిర్వహణపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జూలై 13 జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ( నేషనల్ డీ – వార్మింగ్ డే) సంధర్భంగా 1-19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలన్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంభందించిన ట్రైనింగ్ లను పి.హెచ్.సి.లలో పూర్తి చేశామని , వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాఠశాలలు , కళాశాలలలో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవగాహన కల్పిస్తున్నారని, జిల్లాలో1-19 సంవత్సరాల పిల్లలు 181425 ( లక్షా ఎనభై ఒకవేయి నాలుగు వందల ఇరవై ఐదు ) వుండగా 236400 ( రెండు లక్షల ముప్పై ఆరువేల నాలుగు వందల ) అల్బెండజోల్ మాత్రలు సిద్ధంగా ఉంచామని , అన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడ మాత్రలను పంపించామని, ఉదయం స్కూల్ లో ప్రార్థన చేసిన తర్వాత పిల్లలకు చేతుల పరిశుభ్రత, అల్బెండజోల్ మాత్రల గురించి తెలియజేయాలన్నారు.

 ఈనెల 13వ తేదీన మాత్రలు వేసుకోని పిల్లలకు తేది: 20.07.2026 నాడు మాపప్ కార్యక్రమం. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు , ఆశ కార్యకర్తలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అల్బెండజోల్ మాత్ర – కడుపులో పెరిగే నులిపురుగులను నిర్మూలిస్తుంది. పిల్లలలో మంచి ఎదుగుదలతో పాటు చురుగ్గా, మానసిక శారీరక ఆరోగ్యంగా వుంటారు. అల్బెండజోల్ వల్ల పిల్లలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . నిపుణులైన పిల్లల వైద్యుల సేవలు . అందుబాటులో ఉంచుతున్నామన్నారు.. గోర్లు శుభ్రంగాను, చిన్నవిగా వుండాలని, శుభ్రమైన నీటినే త్రాగాలని,తినే పదార్థాలపై మూతలు పెట్టాలని, పండ్లు కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలని, భోజనం చేసేముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, బహిరంగ మల విసర్జన చేయరాదన్నారు. మరుగుదొడ్డిని ఉపయోగించాలని,పాదరక్షలు ధరించాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కడుపులో నులి పురుగులు వుంటే పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, అలసట, శారీరక మానసిక అభివృద్ధి సరిగ్గా ఉండకపోవడం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బలహీనత, బరువు తగ్గడం మొదలైన అనేక సమస్యలు వుంటాయని, నులిపురుగుల నిర్మూలన ( అల్బెండజోల్ మాత్ర ) వల్ల చదువులు, ఆట పాటల్లో చురుగ్గా వుండడం , మెరుగైన రక్తహీనత, మెరుగైన పోషకాహార స్థితి, పాఠశాలలో మెరుగైన హాజరు ( డ్రాప్ అవుట్ లేకపోవడం) మొదలైన అనేక ప్రయోజనాలు వున్నందున ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వొకేషనల్ కళాశాలలు, రిహాబిలిటేషన్ సెంటర్లు, రెస్క్యూ హోమ్స్, లేబర్ , మైగ్రెంట్, స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్స్ , చైల్డ్ కేర్ హోమ్స్ , అనాధ ఆశ్రమాలు , అంగన్వాడి సెంటర్లు అన్నీ చోట్ల వుండే పిల్లల కోసం ఆక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పర్యవేక్షణ చేస్తున్నామని ,మీ పిల్లలను నులిపురుగుల ( సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మంతీస్ )నుండి రక్షించాలని, 13 తేది నాడు అల్బెండజోల్ మాత్రలు వేసుకోని పిల్లల కోసం 20 వ తేది నాడు మాపప్ కార్యక్రమం నిర్వహిస్తామని, జిల్లా అధికారులు , మీడియా , ప్రభుత్వ , ప్రైవేట్ విద్యా సంస్థలు, తలిదండ్రులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.