*:ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అధికారులు,ఐకెపి నిర్వాహకులు,అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని,జిల్లా రెవెన్యూ, ఆడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు.మంగళవారం ఆయన వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు..అనంతరం మార్కెట్ కార్యాలయ కార్యదర్శి వెంకటలక్ష్మి అందుబాటులో లేకపోవడంతో (సెలవులో ఉండటంతో) ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అధికారులు అలసత్వం వహించొద్దన్నారు. మార్కెట్ యార్డులో,ఐకెపి సెంటర్లలో అధికారులు, నిర్వాహకులు,ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు.రైతులకు అవసరమైన,టార్పాలిన్లు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు.అధికారులు అలసత్వం వహించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆయన వెంట పౌరసరఫరాల శాఖ డిఎం హరికృష్ణ,మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య భీమా నాయక్, తాహాసిల్దార్ దశరథ,ఆర్ఐ కరుణాకర్ రెడ్డి,మార్కెట్ కార్యాలయ సూపర్వైజర్ రమేష్,తదితరులు పాల్గొన్నారు.