ఆలేరు జూనియర్ సివిల్ కోర్టులో సమన్వయ సమావేశం
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
వి. మాధవి లత
యాదాద్రి భువనగిరి అక్షర కలం
యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు వారి సూచనల మేరకు, సంస్థ కార్యదర్శి వి. మాధవి లత మంగళవారం ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు న్యాయవాదులు, పోలీసు యంత్రాంగముతో ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టు హాలులో జాతీయ లోక్ అదాలత్ పై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వనమా రాజు, ఉపాధ్యక్షులు టి .హరికృష్ణ , కార్యదర్శి చాంద్ పాష , ట్రెజరర్ రవికుమార్, న్యాయ వాదులు జూకంటి రవీందర్ , సీసా శ్రీనివాస్ గౌడ్,కె వి ప్రసాద్ మరియు ఇతర న్యాయవాదులు, ఎ పి పి ఒ పద్మజ, ఆలేరు సి.ఐ. ఏలాద్రి, మోటకొండూరు ఎస్. ఐ. అశోక్, గుండాల ఎస్. ఐ. తేజంరెడ్డి, ఆత్మకూర్ సి. ఐ. హనుమమంతు నాయక్, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో న్యాయమూర్తులు మాట్లాడుతూ మార్చి 28 వ తేదిన శనివారం రోజున జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడు జాతీయ లోక్ అదాలత్ లో అధిక కేసుల పరిష్కారానికి కృషి చేయాలని గ్రామ స్థాయిలో ప్రచారం కూడా నిర్వహించాలని, ముందస్తుగా నోటీసులను సంబంధిత కక్షిదారులకు అందచేయాలని తెలిపారు. ప్రతీ రోజు ప్రి సిట్టింగ్స్ ఏర్పాటు అయ్యాయని ఈ ప్రి సిట్టింగ్స్ ద్వారా కేసులను పరిష్కరించేందుకు వెసులుబాటు ఉందని ఈ అంశం కూడా ప్రజలకు చేరవేయాలని తెలిపి తగిన సూచనలు చేసారు.