నల్ల బిల్లుల పేరుతో ప్రజలను వేధించవద్దు

 . . . కార్పొరేటర్  గడుగు రోహిత్

బతుకమ్మ, నిజామాబాద్:

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బిల్లులు వసూలు చేసే క్రమంలో ప్రజలను ఇబ్బందులకు గురి  చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గడుగు రోహిత్ గారు కాంగ్రెస్ నేతలతో కలిసి మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ గడుగు రోహిత్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొందరు బిల్లులు వసూలు చేసే క్రమంలో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముఖ్యంగా నల్ల కలెక్షన్లు చేసేటువంటి బిల్ కలెక్టర్లు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే నల్లా కనెక్షన్ తొలగిస్తామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన అధికారులు ఎవరైనా వచ్చి నల్ల బిల్లుల కోసం ఇబ్బందులకు గురి చేస్తే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను సంప్రదించాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో స్థానిక నేతలు ఎల్లవేళలా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చిన మాకు తెలియజేయాలని ఆయన ప్రజలకు సూచించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన మేయర్ కావాలని కక్షపూరితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అధికారులను పురమాయించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని, ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సహించేది లేదని అన్నారు. నల్ల బిల్లుల కలెక్షన్లు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని అప్పుడు 9 సంవత్సరాలు కాలక్షేపం చేసి ఇప్పుడు హడావిడిగా బిల్లుల కలెక్షన్ చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అన్నారు. తమరి హయాంలో నెలకు కొద్ది మొత్తంగా బిల్లులు వసూలు చేసిన ఇప్పుడు ప్రజలపై భారం పడేది కాదని తమరి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దగ్గరుండి బలవంతపు నల్ల బిల్లుల వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చరణ్, అరుణ్, అక్బర్ హుసేన్, ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు. నవాజ్, మోయిన్, సయ్యద్ అర్షాద్, షేక్ జాకిర్,జిల్లా అధ్యక్షులు  వరద బట్టు వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.