సమాచార శాఖ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకపోవటంలో డి పి ఆర్ ఓ లదే కీలకపాత్ర… 4 th ఎస్టేట్ గా పత్రిక రంగం….. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్….
సూర్యాపేట జూలై 31 ( అక్షర కలం ప్రతినిధి):
డి పి ఆర్ ఓ గా విధులు నిర్వహించిన రమేష్ కుమార్ అంకిత భావంతో పని చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి సమాచారం ప్రజలకి చేరే విధంగా విధులు నిర్వహించారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు. గురువారం కలెక్టరెట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డి పి ఆర్ ఓ పదవి విరమణ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అధికారులు మంచి బృందంగా ఏర్పడి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెలెందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.డి పి ఆర్ ఓ గా విధులు నిర్వహించిన రమెష్ జిల్లాలో మంత్రుల కార్యక్రమాలు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులని సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా నిర్వహించారని తెలిపారు.బయట తినుబండారాలు తినకుండా ఇంటి ఆహరం మాత్రమే తీసుకొని ఆరోగ్యంపై చాలా శ్రద్ద తీసుకునేవారని తెలిపారు.తదుపరి జీవితం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాక్షించారు.
సమాచార శాఖ 4 వ ఎస్టేట్ గా అడ్వాన్స్ టెక్నాలజి ని ఉపయోగించుకుంటు సమాజానికి దిశ నిర్దేశం చేయాలని సూచించారు.
అదనపు కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ డి పి ఆర్ ఓ గా జిల్లాలో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహించారని మంత్రుల కార్యక్రమాలు, ముఖ్యమైన సమావేశాలు రాత్రి ఆలస్యం అయినా మీడియా మిత్రులను సమన్వయము చేసుకుంటూ అన్ని పేపర్ లో వచ్చే విధంగా కృషి చేసేవారని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఐ & పి ఆర్ శాఖ లో వివిధ హోదాలో విధులు నిర్వహించెందుకు కుటుంబ సభ్యుల సహకారం ఏంతో ఉందని తదుపరి ఆయురారోగ్యలతో ఉండాలని ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ అన్నారు.
పదవి విరమణ పొందిన డి పి ఆర్ ఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ 1996 జనవరి 19 న ఐ & పి ఆర్ శాఖ విధుల్లో చేరినానని కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి, వివిధ హోదాలలో విధులు నిర్వహించి సూర్యాపేట కి 5 సెప్టెంబర్ 2022 న అదనపు పౌర సంబంధాల అధికారిగా విధుల్లో చేరినారని 18 కలెక్టర్ ల వద్ద పని చేసానని ఇంత మంచిగా జిల్లా అభివృద్ధి కోసం పని చేస్తున్న యువ కలెక్టర్ ని ఎక్కడ చూడలేదని అలాగే జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ రామ లక్ష్మణుల సమన్వయము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని అలాగే జిల్లా అధికారులు కుడా మంచిగా పని చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమం లో డి ఎఫ్ ఓ సతీష్ కుమార్, సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.