బతుకమ్మ, నిజామాబాద్
ఉమ్మడి నిజామాబాద్ ,ఆదిలాబాద్ , సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ గా ఎరుకల నారాయణ భాద్యత స్వీకరించారు. శనివారం నిజామాబాద్ పవర్ హౌస్ కాంపౌండ్ లో సిజిఆర్ఎప్ చైర్మెన్ గా భాధ్యతలు స్వీకరించిన ఎరుకల నారాయణ కు విద్యుత్ శాఖ అధికారులు, వివిధ యూనియన్ల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, సిరిసిల్ల జగిత్యాల జిల్లాలలో విద్యుత్ సమస్యలు ఏదైనా విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఈ జిల్లాల కన్జ్యూమర్స్ సమస్యలను పరిష్కరించబడతాయి అని సి జి ఆర్ ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణ తెలిపారు. నారాయణ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం నిజామాబాద్ సర్కిల్ తరఫున అభినందనలు తెలుపుతూ వారిని సన్మానించారు. సన్మానించిన వారిలో చీఫ్ ఇంజనీర్ రామకృష్ణ , డిచ్పల్లి డివిజనల్ ఇంజనీర్ ఉత్తం జాడేవార్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ నాంపల్లి ,జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారం ,నందిపేట ఏడిఇ అశోక్ ,నాగరాజు , చంద్రశేఖర్ ,అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు.