మోర్తాడ్ ఎస్సై విక్రమ్ కు రైతులు సన్మానం

బతుకమ్మ, మోర్తాడ్ : మోర్తాడ్ మండలం ఎస్సైగా బాధ్యతలు తీసుకున్న విక్రమ్ భూపల్లిని ఆదివారం మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామ రైతులు కలిశారు. ఎస్సైని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం విక్రమ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరిస్తామని అన్నారు. మోర్తాడ్ మండల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారంకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు గురుజాల నర్సారెడ్డి, బాబ్బూరి లింబద్రి, జాక్క సంతోష్, బడే రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.