బతుకమ్మ: బిచ్కుంద : వినాయక పండగ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని బిచ్కుంద సీఐ జగడం నరేష్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో మండలంలోని యువజన సంఘాల సభ్యులు, ముస్లిం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వినాయక పండగ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, నిమజ్జనంలో డీజే సౌండ్లు వినియోగించవద్దని , మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండప వివరాలను పోలీసు అధికారులకు వివరాలు సమర్పించాలని అన్నారు. వినాయక ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించడానికి యువత సహకరించాలన్నారు. విద్యుత్తు, పంచాయతీ, పురపాలిక అధికారులతో సమన్వయం చేసుకొని నిమజ్జనేర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు. యువత సమస్యలు ఉంటే నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి, వినాయక మండపాల నిర్వాహకులు, ముస్లిం సోదరులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
