బోధన్ జిల్లా ఆస్పత్రిలో వృద్ధాప్య వైద్య శిబిరం

బతుకమ్మ, బోధన్ : పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో గురువారం వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్  డాక్టర్ సుమన్ హోమియో పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానేమన్ చిత్రపటానికి పుల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వెంక టేశ్ మాట్లాడుతూ.. అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయడంతోపాటు మందులను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.  హోమియో డాక్టర్ నీలిమా మాట్లాడుతూ హోమియో మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, దీర్ఘ కాలిక వ్యాధులు, చర్మవ్యాధులు, జ్వరాలు, అర్షమొలలు, కీళ్ల నొప్పులు, సీజనల్ వ్యాధులు అన్నిటికీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నామన్నారు. శిబిరంలో ఆయూష్ విభాగం ఫార్మాసిస్ట్ లు న్యావనంది పురుషోత్తం, విజయ లక్మి, ఉమాప్రసాద్, సంధ్య, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.