- ఎన్నికల హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలి
- ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఆందోళనలకు పూనుకుంటాం
- సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ జిల్లా నాయకులు కిషన
బతుకమ్మ, ఏర్గట్ల : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని లేదంటే ఆందోళనలకు పూనుకుంటామని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు జి. కిషన్ అన్నారు. మండల కేంద్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని CPI(ML) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం ఏర్గట్ల తహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్ ఐ సదానందంకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు, అర్హులైన నిరుపేదలకు పెన్షన్లు, వ్యవసాయ కార్మికులకు ప్రకటించిన 12000 రూపాయలు జీవన భృతి, కాంట్రాక్టు కార్మికులకు సెలవులతో కూడిన కనీస వేతనాలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ సమస్యలపై ఆగస్టు 8న చలో కలెక్టరేట్ కొత్తగూడెం, 21న చలో హైదరాబాద్ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు సురేష్ , సత్తెక్క , అశోక్, దయాళ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
