సమయానికి బస్సులు లేక… స్కూల్ కు గంట ఆలస్యం

  •  నందిగాం, మద్దెపల్లి గ్రామాలకు విడిగా బస్సులను వేయాలని విన్నపం

బతుకమ్మ, బోధన్ : ఊరికి సమయానికి బస్ లు రాకపోవడంతో స్కూల్ కు గంట ఆలస్యంగా వెళుతున్నారని, నందిగాం కు బస్ వేయాలని కోరుతూ నవీపేట్ మండలం నందిగామ ప్రజలు శనివారం ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జన చైతన్య వేదిక అధ్యక్షులు ద్యావడే సంజీవ్ కుమార్ మాట్లాడుతూ
నందిగాం ,మద్దెపల్లి రెండు గ్రామాలకు ఒకేబస్సు వేయడంతో విద్యార్థులు గంట ఆలస్యంగా పాఠశాలకు వెళుతున్నారని, దీంతో విద్యార్థులు క్లాసులు నష్టపోతున్నారని తెలిపారు. కావున గతంలో మాదిరి మద్దేపల్లి నందిగాం గ్రామాలకు వేరు వేరు బస్సులు నడపాలని కోరుతూ ఆర్టీసీ అధికారులకు గ్రామస్థులు వినతి పత్రం అందజేశారని తెలిపారు. సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని ఆర్టీసీ డి.యం. ఫోన్ లో తెలియజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు భూంరావు ,లాలూ యాదవ్, అనంతరావు, మహేశ్, మహాదేవ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.