రుణమాఫీ కాకపోతే ఆందోళన ఉదృతం

  • ప్రభుత్వం పై రైతులకు నమ్మకం పోతోంది
  • మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

బతుకమ్మ, భీంగల్ : ఎన్నికల్లోరైతులకు ఏకకాలం రూ. 2లక్షల ఋణ మాఫీ చేస్తామని మాటిచ్చి గట్టుకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీని మరచి రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఆగష్టు 15 వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన సీ. ఏం రేవంత్ రెడ్డి ఇప్పటికి చెయ్యకపోవడం తో శనివారం బీయర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ కానీ రైతులు రాస్తా రోఖో, ధర్నా నిర్వహించారు. బాల్కొండ కానస్టెన్సీలోని అన్ని మండలాల నుండి వచ్చిన భాధిత రైతులు, బీయర్ఎస్ శ్రేణులు వేల్పూర్ ఎక్స్ రోడ్డులోని 44 హైవే పై బైటయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి డిసెంబర్ 9 న మాఫీ అని, 100 రోజుల్లో మాఫీ అని, ఆగష్టు 15 తేదీ వరకు అందరికి ఋణమాఫీ చేస్తామని చెప్పి,ఏ ప్రాంతం కు వెళ్తే ఆ ప్రాంతం లో ప్రసిద్ధి చెందిన దేవుళ్ళ పై ఓట్లు పెట్టుకుంటూ ముఖ్యమంత్రి రైతులను ఇప్పటికి మూడుసార్లు మోసం చేసారని దుయ్యాబట్టారు.

If there is no loan waiver, there is concern
మా బాల్కొండ కానిస్టేన్సీ లోని 8 మండలాల్లో కలిపి మొత్తం 47 వేల 70 మంది రైతులు రుణాలు తీసుకొన్నారని, అందులో ఇప్పటి వరకు మూడు విడుతల ప్రభుత్వం చేసిన రుణమాఫీ కేవలం 15వేల 2 వందల మందికి మాత్రమే అయ్యిందన్నారు. మన బాల్కొండ కానస్టెన్సీలో ఇంకా 31వేల 200 మందికి ఋణ మాఫీ చెయ్యాల్సి ఉందన్నారు. అందుకు రుణమాఫీ కానీ రైతులు కడుపు మంది ప్రభుత్వం పై వ్యతిరేకతతో రోడ్డు ఎక్కరిని ఎమ్మెల్యే అన్నారు.పాత జిల్లా నిజామాబాద్, కామారెడ్డి విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో 3లక్షల 79 వేల మంది రైతులు ఋణం తీసుకుంటే ఇప్పటి వరకు మూడు దాఫల ఋణమాఫీ చేయగా ఇంకా 2 లక్షల 4 వేల మందికి రుణమాఫీ కావాల్సిందన్నారు. మా బాల్కొండ కానస్టెన్సీలో ఇంకా 31వేయి 200 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందని వారిని ఆ ఆఫీస్ ఈ ఆఫీస్ అంటూ తింపకుండా బ్యాంకుల నుండి లిస్ట్ తెప్పించుకొని ఎలాంటి షరతులు లేకుండా ఋణమాఫీ చెయ్యాలని ఈ ధర్నా, రాస్తారోఖో వేదిక ద్వారా ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అబద్దం మాటలతో కాలం వెళ్ళదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికీ ఇంకా కాలం చెల్లిందని, ఈ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం పోతోందని అన్నారు.అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చెయ్యకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బాల్కొండ కానిస్టేన్సీ భాధిత రైతులు, బీయర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

If there is no loan waiver, there is concern

Leave A Reply

Your email address will not be published.