మాదకద్రవ్యాలు, పొక్సో కేసుల్లో విచారణ వేగవంతం..

 

*రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్టమైన చర్యలు…*

*సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని సీసి కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత..*

*నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్..*

అక్షర కలం/ ఖమ్మం ప్రతినిధి:

రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.

సోమవారం పోలీస్ వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ కమిషనర్ సమీక్ష జరిపారు.

సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో వైరా, కల్లూరు డివిజన్ పరిధిలో గుర్తించిన బ్లాక్‌ స్పాట్లలో బ్యారికేడింగ్‌, ప్రమాద సంకేత సూచిక బోర్డులు, స్టాపర్స్‌, సిగల్‌ లైట్స్‌, బ్లింకింగ్‌ లైట్స్‌ ఏర్పాటు చేసి ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా ఎక్కడైనా వాహనం బ్రేక్డౌన్‌ అయినప్పుడు పక్కన రాళ్లు చెట్టుకొమ్మలు పెడుతున్నారని, రాత్రి సమయాలలో అవి కనపడక ఆగి ఉన్న వాహనాలను ఢీ కొట్టడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది కాబట్టి ముందస్తు రోడ్ల పై వాహనాలు అపకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అతివేగం, నిర్లక్ష్యమైన రాష్‌ డ్రైవింగ్‌ చేయడం ప్రమాదానికి కారణమని నివేదికలు చెపుతున్న నేపధ్యంలో డ్రంకన్ & డ్రవ్ తనిఖీ ముమ్మరం చేయాలని ఆదేశించారు.

నేరాలు నియంత్రణ, చోరీ సొత్తు రికవరీల్లో వేగం మరింత పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ఎవ్వరీని ఉపేక్షించవద్దన్నారు.
జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్తుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జీషీటుకు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై రివ్యూ నిర్వహించారు.

సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని సీసి కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తూ సురక్షితమైన సమాజ నిర్మాణంలో భాగంగా స్వచ్ఛందంగా ప్రజల భాగస్వామ్యం కావాలని సూచించారు. అదేవిదంగా సిసి కెమెరాలను హైదరాబాద్ కామాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసేవిధంగా పోలీస్ అధికారులు దృష్టి పెట్టాలని అదేశించారు.

జిల్లాలో గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, మాదకద్రవ్యాల సరఫరా చేసే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
యువత డ్రగ్స్ కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని,డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన వివరిస్తూనే
మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మిసింగ్ కేసుల్లో దర్పన్ యాప్ ద్వారా ఫొటోలు అప్లోడ్ చేయాలని సూచించారు.
ఏదైనా కేసులో ముద్దాయి అరెస్ట్ అయితే ఫోటో,పూర్తి వివరాలు CCTNS లో అప్లోడ్ చేయాలని అన్నారు.

సమావేశంలో సిసిఆర్బి ఇన్స్పెక్టర్ స్వామి, ఎసై రవి, సత్యనారాయణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.