ఘనంగా మణికంఠ స్వామి తిరువాభరణాలు ఊరేగింపు

 సంగారెడ్డి ప్రతినిధి, అక్షరకలం..

 మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీ మణికంఠ స్వామి వారి తిరు ఆభరణాల ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సాహితీ రాము గురు స్వామి ఆధ్వర్యంలో సంజీవ్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి శ్రీ నవరత్నాలయ దేవస్థానం వరకు మంగళ వాయిద్యాల నడుమ అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు సాగింది. 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిజిఐఐసి చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి హాజరై ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాముస్వామి ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తూ, పేదలకు అన్నదానం సేవ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అని ఆమె అన్నారు.


ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురు స్వాములు, సివిల్ స్వాములు, అయ్యప్ప మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.