అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి :లక్ష్మా రెడ్డి
ఉప్పల్(అక్షర కలం వెబ్ )డిసెంబర్:26
చిల్కానగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శివాలయం లో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. నూతనంగా నిర్మాణంలో ఉన్న శివాలయనికి తన నుండి పూర్తి సహకారం ఉంటదని, నిర్మాణం పూర్తి అయ్యేంతవరకు అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో గురు స్వాములు దాసరి కృష్ణ, అమృత రావు, సుబ్బారావు, వాసు, గణేష్, బూర్గుల రమేష్ గౌడ్ గురుస్వాములు, చిల్కానగర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిల్కానగర్ వాసులో పెద్ద సాంఖ్యలో పాల్గొన్నారు.