—శాలిగౌరారం ఎంపీడీఓగా రజితకు అదనపు బాధ్యతలు
అక్షరకలం నల్గొండ
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ )గా జి. రజితకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ ) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శాలిగౌరారం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న జి. జ్యోతిలక్ష్మి స్థానంలో, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఈ మార్పులు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నకిరేకల్ మండల పంచాయతీ అధికారిగా (ఎంపీఓ )గా పనిచేస్తున్న జి. రజిత, ఇకపై శాలిగౌరారం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహించనున్నారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి ఆమోదం తెలపడంతో, సిఈఓ ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి శుక్రవారం ఈ ఉత్తర్వులను (నెం. బి1/3255/2023-26) విడుదల చేశారు. తక్షణమే బాధ్యతలు స్వీకరించి, నివేదిక సమర్పించాలని నూతన ఎంపీడీఓను ఆదేశించారు.