. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్అహ్మద్
(అక్షర కలం )ప్రతినిధి. జూలై 24,
నల్గొండ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కోరారు.
గురువారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వంద రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణంలోని మాంసం దుకాణందారులకు, కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ యాజమానులకు ప్లాస్టిక్ సంచుల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ను నివరించేందుకు ప్రతి ఒక్కరు పాటు పడాలని తెలిపారు. ప్లాస్టిక్స్ను విచ్చలవిడిగా వాడడం వల్ల వాయువుతో పాటు నీటి కాలుష్యం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతిని ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం ప్రకృతికి ప్రాణవాయువు లాంటిదని తెలిపారు. ప్లాస్టిక్ భూతం రోజురోజు పర్యావరణాన్ని కలుషితం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాలకు పైబడిన ప్లాస్టిక్ని వాడాలని సూచించారు. పట్టణంలో నిబంధనలు ఉల్లంగించి నిర్వహిస్తున్న అన్ని దుకాణాలపై దాడులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం సాగే కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ రవీందర్ రెడ్డి మున్సిపాలిటీ సానిటరీ సూపర్వైజర్ గడ్డం శ్రీనివాస్ సానిటరీ ఇన్సపెక్టర్ నంద్యాల ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.