బతుకమ్మ, నిజామాబాద్ క్రైం:
అగస్టు 15 నుంచి నిజామాబాద్ పోలిస్ కమీషనరేట్ పరిధిలో తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మేట్ ధరించాలని నిబంధన అమలు చేస్తున్నందువలన ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని మూడవ టౌన్ ఎస్ఐ నర్సయ్య ప్రజలను కోరారు. అదివారం నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గౌతమ్ నగర్ లో మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కాలురు నరసయ్య ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతు… ప్రతి ఒక్క పౌరులు తమ వంతుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలను నడపనివ్వకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నదని పేర్కొన్నారు. మైనర్ వాళ్లకు ద్విచక్ర వాహనాలను ఇచ్చిన ఎడల తల్లిధండ్రులకు శిక్ష పడడమే కాకుండా 20వేల వరకు జరిమానా ఉంటుందని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరగకుండా ఆపవచ్చని వారు తెలిపారు. అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని వారు తెలిపారు. పిల్లలను చెడు వ్యసనాల బారిన పడకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ పోలీస్ స్టేషన్ సిబ్బంది షౌకత్ అలీ, రఘు, నర్సింలు మరియు మాజీ కార్పొరేటర్ సాయిరాం, స్థానిక కార్పొరేటర్ రాజు మాయావర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు
