బతుకమ్మ, మోర్తాడ్: పశ్చిమబెంగాల్ లోని కలకత్తాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిగా చదువుతున్న విద్యార్థినిపై జరిగిన ఘటనకు నిరసనగా మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి హాస్పిటల్ ఎదుట నినాదాలు చేశారు. వైద్యురాలు పూజ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రమైందని వైద్యులపై ఇలాంటి దాడులు చేయడం సరి కాదన్నారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మరణించిన వైద్య విద్యార్థి ఆత్మకు శాంతి కలగాలని కొన్ని నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పద్మ, సంగీత, రేణుక, ఫాతిమా, నారాయణ తదితరులు పాల్గొన్నారు