కమీషనరేట్ పరిధిలో బహిరంగ మద్యపాన నిషేదం

 ఈ నెల 30 వరకు నిషేధ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై కేసులు
పోలిస్ కమీషనర్ కల్మేశ్వర్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ పోలిస్ కమీషనరేట్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ పోలిస్ కమీషనర్ కల్మేశ్వర్ ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 12 నుంచి 30 ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ లోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం విపరీతంగా పెరిగిపోయిందని, దీని ఫలితంగా సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ముప్పు వాటిల్లుతుందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్వేశ్వర్ సింగెనవర్ దృష్టికి రావడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులు నిజామాబాద్ వీదుల్లో చట్టాన్ని గౌరవించే పౌరుల పట్ల ముఖ్యంగా మహిళలు , పిల్లల పట్ల అసభ్యకరమైన, వికృత , అసభ్యకరమైన ప్రవర్తనను, ప్రదర్శిస్తున్నట్లు నివేధికలు సూచిస్తున్నాయి. సాధారణంగా రోడ్డు వినియోగదారులకు ముఖ్యంగా మహిళలు , పిల్లలకు చికాకు , ఆటంకము కలిగించి ప్రజాప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారని పేర్కోన్నారు. బహిరంగ మద్యపానం ను పరిగణంలోనికి తీసుకొని, అండర్ సెక్షన్ 22(1) (డి) హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఎఫ్ ప్రకారం నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఉత్తర్వులను ఉల్లంఘించి నట్లయితే వారిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 , హైదరాబాద్ సిటీ పోలీస్ 1348 ఫాస్లీ లోని సెక్షన్ & (76) ప్రకారం శిక్షకు అర్హులవుతారు అని కమీషనర్ కల్మేశ్వర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.