రుద్రూర్, బతుకమ్మ : స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కెనరా బ్యాంక్ వారు చేపట్టిన డాక్టర్ అంబేద్కర్ స్కాలర్షిప్ కార్యక్రమంలో భాగంగా గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాల, బాలికల స్కూల్ నందు మెరిట్ ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్, సిబ్బంది స్కూల్ హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.