అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో శశ్రుత్ పటేల్

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ  : అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో కౌడపు శశ్రుత్ పటేల్ కలుసుకున్నారు. గత నాలుగు రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తున్నసీఎం రేవంత్ రెడ్డి గురువారం డల్లాస్ లోని ఓ ఐటి కంపెనీలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు శుశ్రుత్ పటేల్ ని చూసి సీఎం రేవంత్ రెడ్డికి పరిచయం చేశారు.

దీంతో సీఎం శుశ్రుత్ తనకు తెలుసునని దెగ్గరికి పిలిచి అప్యాయంగా పలుకరించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. శశ్రుత్ పటేల్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ద్వారా ఇండియా నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుపడంతో సీఎం రేవంత్ రెడ్డి శశ్రుత్ పటేల్ ని అభినందించారు. శుశ్రుత్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూత్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. శుశ్రుత్ టిపిసిసి ఓబిసి సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ అయిన కౌడపు శరత్ కుమారుడు. అయితే అమెరికాలో నివసిస్తున్నజిల్లా వాసులు,జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ వద్ద శశ్రుత్ పటేల్ కి దక్కిన ఆదరణ చూసి ఆనందంలో మునిగిపోయారు.

Shashrut Patel with CM Revanth Reddy on his visit to America

Leave A Reply

Your email address will not be published.