బతుకమ్మ, పిట్లం : తహసీల్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ బాన్సువాడ ఆర్డిఓ రమేష్ రాథోడ్ చేశారు. ఆయన విలేకరితో మాట్లాడుతూ ధర్మారం గేటు వద్ద పెట్రోల్ బంక్ స్థల పరిశీలన అనంతరం పిట్లం తహసీల్ కార్యాలయాన్నీ తనిఖీ చేసి ఉద్యోగుల హాజరు పట్టికను, రికార్డులను పరిశీలించారు. రిజిస్ట్రేషన్లు త్వరగా వచ్చిన అప్లికేషన్లను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు కూడా సత్వరమే ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. ప్రజలకు , విద్యార్థులకు సర్టిఫికెట్లు త్వరగా అందించేలా చర్యలు తీసుకొని వారికి సత్వరమే అందించాలని ఆయన కోరారు. ఆయన వెంట ఉప తాసిల్దార్ సుధాకర్, ఆర్ ఐ శీతల్ తాసిల్ సిబ్బంది ఉన్నారు.