రేపు నకిరేకల్ లో టి యు డబ్ల్యూ జే (ఐ జే యు ) జిల్లా మహాసభ

* ప్రతి మండలం,పట్టణాల నుంచి భారీగా తరలి రావాలి  

* నకిరేకల్ లో సన్నాహక సమావేశంలో టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి 

నల్లగొండ, జూన్ 2 :: ఈనెల మూడవ తేదీన నకరికల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగే టి యు డబ్ల్యూ జె ( ఐ జే యు) జిల్లా మహాసభను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నకరికల్ లో జిల్లా మహాసభ జరిగే ఫంక్షన్ హాల్ పరిశీలనతో పాటు అనంతరం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహాసభకు ప్రతి మండలం ప్రతి పట్టణం నుంచి జర్నలిస్టులు భారీగా తర రావాలని కోరారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం హక్కుల కోసం నిరంతరం కృషి చేసే ఏకైక సంఘం టి యు డబ్ల్యూ జె ( ఐజేయు) నని తెలిపారు. మహాసభలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనేక ముఖ్యమైన తీర్మానాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతిజర్నలిస్టుకు అక్రిడిటేషన్ తోపాటు ఇంటి స్థలం ఇంటి నిర్మాణం, హెల్త్ కార్డుతో పాటు అనేక సౌకర్యాలను కల్పించడం కోసం టి యు డబ్ల్యూ జే నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమాజంలో జిల్లా నాయకులతోపాటు నకే రికల్ నియోజకవర్గ నాయకులు, జర్నలిస్టులు  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.