- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు
బతుకమ్మ, ఎల్లారెడ్డి : అమృత్ స్కీం ద్వారా మున్సిపల్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 35 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 స్కీం ద్వారా నీటి సరఫరా పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎల్లారెడ్డి మున్సిపాలిటీకే అత్యధికంగా నిధులు కేటాయించామని అన్నారు. మినీ ట్యాంక్ బండ్, పార్క్, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుల విగ్రహాలను పెట్టి గౌరవిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, మెగా కంపెనీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.