– కొల్చారం ఎస్సె మహమ్మద్ మొయినుద్దీన్…
కొల్చారం, అక్టోబర్ 15 (అక్షర కలం వెబ్ ):-
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి అని కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహినుద్దీన్ అన్నారు. బుధవారం మండలంలోని పైతర గ్రామంలో సైబర్ నేరాలపై గ్రామస్తులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఫోన్లలో తమ పిల్లలు వివిధ కేసులలో అరెస్టు అయినట్లు వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని ఓటిపి చెప్పాలని అడిగిన ఓటిపి చెప్పొద్దని సూచించారు. ఇండ్లలోని చిన్న పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మహేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.